కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ : రైతులు బ్యాంకు రుణాలు పొందడం ఎలా?

అన్నదాతల సంక్షమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటిలో చాలా మంది రైతులకు ఆ పథకాల గురించి కూడా తెలీదు. చాలా మంది రైతులు తమ పంటల కోసం బయట అధిక వడ్డీలకు డబ్బులు వడ్డీలు తెచ్చి నష్టపోతుంటారు. అలా వారు నష్ట పోకుండా రైతుల సంక్షేమం కోసం ‘Kisan Credit Card’ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 

పంట రుణాలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులకు ఎంతో సహాయపడతాయి. చిన్న, సన్నాకారు రైతులకు వాణిజ్య బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణం లభిస్తుంది. దీంతో పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడటమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ రుణాలు చెల్లించే కాలం రుణ మొత్తాన్నీ తీసుకున్న పంట యొక్క కోత లేదా మార్కెటింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.  ఇక్కడ Kisan Credit Card మరియు దాని ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

Kisan Credit Card రుణ పథకానికి అర్హతలు..

  • వ్యవసాయంతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి అయినా, ఆ వ్యక్తి తన పొలంలో సాగు చేస్తున్నా లేదా వేరొకరి భూమిలో పని చేస్తున్నా Kisan Credit Card కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • Kisan Credit Card కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి కనీసం 18 సంవత్సరాలు మరియు రుణ వ్యవధి ముగిసే వరకు గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. 
  • 60 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా సహ దరఖాస్తుదారుడిని కలిగి ఉండాలి. 

Kisan Credit Card కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు..

  • పూర్తిగా నింపిన మరియు సంతకం చేసిన దరఖాస్తు ఫారం
  • ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన గుర్తింపు కార్డులు.
  • అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్.
  • భూమి పత్రాలు
  • దరఖాస్తుదారుడి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో.
  • బ్యాంకులు జారీ చేసిన సెక్యూరిటీ పీడీసీ పత్రాలు

Kisan Credit Card యొక్క ప్రయోజనాలు..

  • వడ్డీ రేటు 2 శాతం వరకు తక్కువగా ఉంటుంది.
  • సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ఎంపికలు మరియు ఇబ్బంది లేని పంపిణీ ప్రక్రియ.
  • అన్ని వ్యవసాయ మరియు సహాయక అవసరాలకు ఒకే రుణ సౌకర్యం.
  • ఎరువులు, విత్తనాలు మొదలైనవి సేకరించడంలో సహాయం
  • వ్యాపారులు లేదా డీలర్ల నుంచి నగదు తగ్గింపు పొందడంలో సహాయం.
  • 3 సంత్సరాల వరకు క్రెడిట్ లభిస్తుంది. పంట కోత కాలం పూర్తయిన తర్వాత తిరిగి చెల్లించవచ్చు. 
  • దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంక్ శాఖ నుంచి అయిన నిధులు ఉపసంహరించుకోవచ్చు. 

Kisan Credit Card ఎలా పనిచేస్తుంది?

  • కస్టమర్ తప్పనిసరిగా బ్యాంకును సందర్శించి Kisan Credit Card కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
  • అప్పుడు రుణ అధికారి దరఖాస్తుదారునికి ఇవ్వాల్సిన రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇది రూ.3 లక్షల వరకు ఉంటుంది. 
  • ఈ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత వినియోగదారులకు బ్యాంక్ Kisan Credit Card జారీ చేస్తుంది. 
  • కార్డ్ హోల్డర్ ఇప్పుడు పొడిగించిన క్రెడిట్ పరిమితికి వ్యతిరేకంగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 
  • తీసుకున్న క్రెడిట్ మొత్తంపై మాత్రమే వడ్డీ రేటు వర్తిస్తుంది. 
  • సకాలంలో చెల్లించిన రుణంపై కనీస వడ్డీరేటు వర్తించేలా చేస్తుంది. 

Kisan Credit Card కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడం ఎలా?

స్టెప్ 1- మీ సంబంధిత బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి.

స్టెప్ 2- హోమ్ పేజీలో రుణాల ఎంపిక వద్ద Kisan Credit Card కోసం దరఖాస్తు చేయండి. 

స్టెప్ 3 – ఇక్కడ ఫారం చదివి జాగ్రత్తగా నింపండి.

స్టెప్ 4 – ఫారం నింపిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5 – మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 

స్టెప్ 6 – ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఆ సంఖ్యను సేవ్ చేసుకోండి. 

Kisan Credit Card అందించే బ్యాంకులు ఇవే..

SBI Kisan Credit Card Link – Apply Here

PNB Kisan Credit Card Link – Apply Here

AXIS Kisan Credit Card Link – Apply Here

HDFC Kisan Credit Card Link – Apply here

Kisan Credit Card బీమా..

Kisan Credit Card  రైతులకు ప్రమాద బీమా సౌకర్యం కూడా అందిస్తుంది. మరణించినప్పుడు రూ.50 వేలు మరియు వైకల్యం కలిగినప్పుడు రూ.25 వేల బీమా కవర్ ను బ్యాంకులు అందిస్తాయి. మరిన్ని వివరాల కోసం రైతులు బ్యాంకులను సందర్శించాలి. 

 

Leave a Comment