చెలరేగిన పోలార్డ్.. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. యువరాజ్, గిబ్స్ సరసన..!

వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్ లో పోలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడో క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇదే మ్యాచ్ లో అఖిల ధనంజయ హ్యాట్రిక్ వికెట్లు తీయగా, ఆ తర్వాతి ఓవర్లో పోలార్డ్ ఊచకోతకు గురయ్యాడు. 

యువరాజ్, గిబ్స్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా పోలార్డ్ చరిత్రకెక్కాడు. అదేవిధంగా టీ20ల్లో ఈ రికార్డు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఈ ఫీట్ సాధించాడు. అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షె్ గిబ్స్ నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే బౌలింగ్ లో ఆరు సిక్సర్లు బాదాడు. 

 

Leave a Comment