కేజీఎఫ్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్య.. అదే అఖరి కోరిక అంటూ సూసైడ్ నోట్..

కేజీఎఫ్ హీరో యశ్ డై హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ(25) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ లో తన చివరి కోరిక గురించి రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

సూసైడ్ నోట్ లో ఏముందంటే.. తాను తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేకపోయానని పేర్కొన్నాడు. చివరికి ప్రేమను గెలవడంలో కూడా విఫలమయ్యానని, ఇక జీవితంలో సాధించడానికి ఏమీ లేదని అని రాశాడు. తాను కేజీఎఫ్ హీరో యశ్ తోపాటు, కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఇద్దరికీ పెద్ద ఫ్యాన్ అని చెప్పుకున్నాడు. వారిద్దరూ తన అంత్యక్రియలకు హాజరుకావాలని, అదే తన చివరి కోరిక అని పేర్కొన్నాడు. 

అభిమాని మరణవార్త తెలుసుకున్న యవ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అభిమానుల అభిమానమే తమకు బలమని, మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని చెప్పుకొచ్చాడు. కాగా మాజీ సీఎం సిద్ధరాయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.