దుమ్ము రేపుతున్న ‘కేజీఎప్ 2’ టీజర్..!

KGF Chapter 2 Teaser 

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్(KGF) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ రికార్డు నమోదు చేసింది. ఇక ఈ సినిమాతో హీరో యశ్ జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ చిత్రం కొనసాగింపుగా వస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ -2(KGF Chapter 2). ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

కేజీఎఫ్ చాప్టర్-2(KGF Chapter 2) టీజర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కేజీఎఫ్ 2 టీజర్ యూట్యూబ్ లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ కు విపరీతంగా లైక్స్ వస్తున్నాయి.  ఈ సినిమాను జూలై 30న విడుదల చేయాలని చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

కేజీఎఫ్ చాప్టర్ -2(KGF Chapter 2) సినిమా టీజర్ ను యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా టీజర్ లీక్ అయి వైరల్ గా మారింది. దీంతో జనవరి 7న టీజర్ ను రిలీజ్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా పాత్రలో నటిస్తుండగా, రవీనా టాండన్ శక్తివంతమైన రాజకీయ రాయకురాలు పాత్రలో నటిస్తున్నారు.

Leave a Comment