కరోనా నివారణకు కీలక చర్యలు

అమరావతి : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యటు చేపట్టింది. గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనాపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  

  •  థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించారు.
  •  పెద్ద దేవాలయాల్లో నిత్యకైంకర్యాలు కొనసాగిస్తూ, భక్తులకు దర్శనాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
  • చిన్న దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా భక్తులు వెళ్లడం మానుకుంటే మంచిదని సూచించారు. 
  •  పెద్దసంఖ్యలో గుమిగూడే జాతరలు లాంటివి నిర్వహించకుండా మానుకుంటే మంచిదన్నారు. 
  • హోటళ్లు, రెస్టారెంట్లలో 2 మీటర్ల దూరంలో ఉండేలా చూడాలన్నారు. 
  • వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని సూచించారు. వీలైతే రద్దు చేసుకోవాలన్నారు.
  •  పబ్లిక్‌ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని సూచించారు.
  • ప్రజారవాణాలో ఉన్న వాహనాలు నిరంతరం శుభ్రత పాటించాలన్నారు. ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకోవద్దని సూచించారు. సోషల్‌ డిస్టెన్స్‌ ఉండేలా చూడాలన్నారు. నిలబడి ప్రయాణం చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. 
  • జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నవారు ప్రయాణాలు నిలుపుదల చేసుకోవాలన్నారు.  మార్చి 31 వరకూ ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయన్నారు. 
  • వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులైన వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు.

Leave a Comment