‘సెక్స్ కోసం వెళ్లాలి.. పాస్ ఇవ్వండి’.. పోలీసులకు వింత రిక్వెస్ట్..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు తిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇందుకు ఆన్ లైన్ లో పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాయి. 

ఈక్రమంలో కేరళ పోలీసులకు ఓ విచిత్రమైన రిక్వెస్ట్ వచ్చింది. కన్నూర్ లోని కన్నాపురానికి చెందిన ఓ వ్యక్తి ‘సాయంత్రం సెక్స్ కోసం వెళ్లాలి’ అంటూ లాక్ డౌన్ లో ఈ-పాస్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తును చూసి షాకైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే తాను పొరపాటున అలా రాశానని ఆ వ్యక్తి విచారణలో పేర్కొన్నాడు. తాను ‘సాయంత్రం ఆరు గంటలకు బయటకు వెళ్లాలి’ అని దరఖాస్తు చేశానని చెప్పాడు. అయితే అందులో సిక్స్ కు బదులు సెక్స్ అని పడిందని, ఆ తప్పును చూసుకోకుండా తాను దరఖాస్తు చేశానని తెలిపాడు. తన తప్పిదాన్ని క్షమించాలని కోరాడు. దీంతో పోలీసులు అతడ్ని వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ రిక్వెస్ట్ సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment