అతడు మా ఆవులపై లైంగిక దాడి చేస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు..!

సాధారణంగా మహిళలపై అత్యాచారం జరిగితే న్యాయం చేయాలని పోలీసుల వద్దకు వెళ్తారు.. కానీ కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్ లో వింత సమస్య వచ్చింది. తమ ఆవులను అత్యచారం చేస్తున్నారని కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా తమ జీవనాధారమైన ఆవును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 

2021 జనవరి నుంచి తరచూ పశువులపై దాడి జరుగుతుంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పశులుపై లైంగిక దాడి జరిగినట్లు బయటపడింది.

ఓ వ్యక్తి ఆవులను కట్టేసి కొట్టి వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడని, పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని రైతులు ఆరోపించారు. తంబి అనే రైతు వద్ద ఏడు ఆవులు ఉండేవి. వాటిలో నాలుగు ఆవులను అమ్మేసుకున్నాడు. వాటిపై ఐదు సార్లు లైంగికదాడి జరగడంతోనే అమ్మేసినట్లు రైతులు తండి తెలిపాడు. ఫస్ట్ ఎవరో వ్యక్తిగత కక్షతోనే తమ ఆవులపై దాడి చేస్తున్నట్లు అనుకున్నానని, ఆ తర్వాత చాలా మంది రైతులకు ఇదే విధంగా జరిగిందని తంబి అన్నాడు. నిందితుడు అసహజ రీతిలో ఆవులపై లైంగిక కార్యలకాపాలు సాగిస్తున్నాడని తెలిపాడు.  

ఇలా మొత్తం 20 మంది రైతులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. అయితే రైతులు పట్టకున్న ఆ వ్యక్తి మానసిక స్థితి బాగాలేదని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామనా పోలీసులు తెలిపారు.    

Leave a Comment