అదృష్టం అంటే ఇదేనేమో.. లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్..!

ఓ ఆటో డ్రైవర్ కు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళలో ఓనం పండుగ సందర్భంగా తిరుఓనం బంపర్ లాటరీ నిర్వహించారు. ఆ లాటరీ ఫలితాలను ఈ ఆదివారం ప్రకటించారు. ఈ పలితాల్లో టీఈ-645465 నంబర్ టికెట్ బంపర్ బహుమతికి ఎంపికైంది. ఈ టికెట్ కొనుగోలు చేసింది కేరళ ఎర్నాకుళం జిల్లాలోని మరాడుకు చెందిన ఆటో డ్రైవర్ పీఆర్ జయపాలన్ అని నిర్ధారణ అయింది. 

ఈనెల 10వ తేదీన ఈ లాటరీని ఆటో డ్రైవర్ జయపాలన్ త్రిపురినింతలో కొనుగోలు చేశాడు. ఫ్యాన్సీ నంబర్ కావడంతో ఈ టికెట్ ను కొనుగోలు చేశాడు. ఈ లాటరీ టికెట్ కు ప్రైజ్ కింద రూ.12 కోట్లు వస్తాయి. అయితే పన్నుల కింద రూ.5 కోట్లు మినహాయించుకుని రూ.7 కోట్లు ఆటో డ్రైవర్ కి అందించనున్నారు. లాటరీలో ఫస్ట్ ప్రైజ్ రావడంతో జయపాలన్ సంతోషం వ్యక్తిం చేశాడు..

Leave a Comment