ఎడమ కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్..!

36
Katti Mahesh

సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఒక కంటైనర్ లారీని కత్తి మహేష్ కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కత్తి మహేష్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కళ్లకు నేడు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అయితే ఆయన ఎడమ కంటి చూపు పూర్తిగా పోయిందని వైద్యులు చెబుతున్నట్లు ఆయన మేనమామ ఎం.శ్రీరాములు మీడియాతో చెప్పారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడంతో మహేష్ కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. 

Previous articleక్రికెటర్ తో దర్శకుడు శంకర్ కూతురి పెళ్లి..!
Next articleపొలంలో మహిళా కూలీకి దొరికిన వజ్రం.. లక్షాధికారి అయిన మహిళ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here