కన్నీరు తెప్పిస్తున్న 9వ తరగతి విద్యార్థి సూసైడ్ నోట్..!

ఈరోజు మా అమ్మ పుట్టిన రోజు.. అమ్మతో మాట్లాడుతా.. ఫోన్ ఇవ్వండి.. అని ఓ విద్యార్థి కోరినా.. హాస్టల్ వార్డెన్ పోన్ ఇవ్వకపోవడంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఉళ్లాలలో శారద విద్యానికేతన్ స్కూల్ హాస్టల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. 

బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన పూర్వజ్(14) శారదా విద్యానికేతన్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి బర్త్ డే కావడంతో ఆమెకు విషెస్ చెప్పాలనుకున్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వాలని, తల్లితో మాట్లాడతానని హాస్టల్ వార్డెన్ ని పూర్వజ్ కోరాడు. ఫోన్ ఇచ్చేందుకు వార్డెన్ ఒప్పుకోలేదు. 

పుట్టినరోజు నాడు తల్లితో మాట్లాడలేకపోయానని పూర్వజ్ మనోవేదనకు గురయ్యాడు. శనివారం రాత్రి సూసైడ్ నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. ఆ సూసైడ్ నోట్ లో పూర్వజ్ తన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. అందరూ ఆనందంగా ఉండాలన్నాడు. స్కూల్ లో తన కోసం చెల్లించిన ఫీజు వెనక్కి తీసుకోవాలని కోరాడు. అంత ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఖంలో పడేశారంటూ సూసైడ్ నోట్ లో రాసిన ఆ విద్యార్థి మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కాగా బాలుడి ఆత్మహత్యకు స్కూల్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ కారణమంటూ పూర్వజ్ మేనమామ అరుణ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Leave a Comment