కర్నాటక మంత్రి రాసలీల వీడియో.. కర్నాటకలో కలకలం..!

కర్నాటక జలవనరుల శాఖా మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల వీడియో కలకలం రేపుతోంది. ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల కింద డాక్యుమెంటరీ విషయమై మంత్రి వద్దకు వచ్చిన యువతిని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ యువతితో మంత్రి చవునుగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి వైరల్ గా మారాయి. 

ఉద్యోగం ఇప్పిస్తానని ఒక యువతిని మంత్రి లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కు ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించిన ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ లో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యాంలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. 

అలా పరిచయమైన యువతితో మంత్రి రాసలీలలు నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ రాసలీల వీడియో పలు టీవీ చానళ్లలో ప్రసారం కూడా అయింది. దీంతో కర్నాటక రాజకీయాల్లో కలకలం రేగింది. ప్రాణభయంతో ఆ యువతి తన వద్దకు వచ్చిందని దినేష్ తెలిపారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తనపై ఎవరో కుట్ర చేస్తున్నారని మంత్రి జార్కహోళి చెప్పారు. తాను రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. 

Leave a Comment