రాసలీల వీడియో లీక్.. మంత్రి రాజీనామా..!

కర్నాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి రాసలీల వీడియో బయటపడిన సంగతి తెలిసిందే.. కొద్ది రోజుల కిందట డాక్యుమెంటరీ విషయమై యువతి మంత్రి వద్దకు వచ్చింది. ఈక్రమంలో మంత్రి ఆమెను లోబర్చుకుని ఆమెతో రాసలీలు జరిపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో, ఆడియో సీడీలను పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కు అందజేశారు. 

మంత్రి రాసలీల నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేశాయి. తాజాగా మంత్రి రమేశ్ నైతికంగా తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అది ఫేక్ వీడియో అని, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని తనకు నమ్మకం ఉందని మంత్రి రమేశ్ తెలిపారు.  

Leave a Comment