పెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిసింది..!

198
Kanpur Marriage

ఎవరైనా పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు. అలా ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని, ట్రాన్స్ జెండర్ ని అని తెలిసింది. దీంతో మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఏప్రిల్ 28 వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి భార్య అతడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఒక కారణం చెప్పి అతడిని దూరం పెట్టింది. 

అనారోగ్యం పేరుతో శృంగారలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది. అలా పెళ్లయి రెండు నెలలు గడుస్తూన్నా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు చెప్పిన మాటలు విని షాక్ కు గురయ్యాడు. ఆమె మహిళ కాదని, ట్రాన్స్ జెండర్ అని తెలిసింది. దీంతో మోసపోయానని తెలుపుకున్న ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.  

 

 

Previous articleగర్ల్ ఫ్రెండ్ కోసం సోనూసూద్ కు ఐఫోన్ అడిగిన యూజర్..!
Next articleఆర్థిక నేరగాళ్ల విలువైన ఆస్తులు స్వాధీనం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here