1947లో భారత్ కి స్వాతంత్య్రం రాలేదు.. కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భారత స్వాతంత్య్ర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం రాలేదని, అది బ్రిటీష్ వారు పెట్టిన  భిక్ష అని, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే స్వాతంత్య్రం వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చిచ్చు రేపుతున్నాయి.   ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. నిన్నటి వరకు మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడమే కాకుండా, గాంధీజిని హత్య చేసిన గాడ్సేను పొగిడారు. ఇప్పుడు స్వాతంత్య్ర సమరయోధులు మంగళ్ పాండే, రాణి లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది మంది వీరులను అగౌరవ పరిచారు.. దీనిని పిచ్చా లేక దేశద్రోహమా అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. 

ఇక నెటిజన్లు కూడా కంగనా వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని అవమానించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్..  

Leave a Comment