కెప్టెన్ గా వార్నర్ ను తప్పించిన సన్ రైజర్స్..!

IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో వార్నర్ ఉంటాడా ? లేడా? అనేది సందేహంగా మారింది. తర్వాత మ్యాచ్ నుంచి కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉంటాడంటూ సన్ రైజర్స్ ప్రకటించింది. 

కాగా, ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడి కేవలం ఒక్కదాంట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్ సామర్థ్యంపై విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

Leave a Comment