దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా ‘కంబలంగి’..!

మహిళలు నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా యువతులు శానిటరీ నాప్కిన్స్ ని ఎక్కువగా వాడుతుంటారు.. అయితే కేరళలోని ఓ గ్రామం దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ రహిగ గ్రామంగా రికార్డులకెక్కింది. ఎర్నాకులం జిల్లాలోని కుంబలంగి అనే లంక గ్రామంలో నాప్కిన్స్ కి బదులు మెన్ స్ట్రువల్ కప్స్ వాడుతున్నారు. మూడు నెలలుగా బాలికలు, యువతులకు 5 వేల మెన్ స్ట్రువల్ కప్స్ పంపిణీ చేశారు. 

‘అవల్కాయ్(ఆమె కోసం)’ అనే పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సాయంతో అమలు చేశారు. మహిళలు నెలసరి సమయంలో నాప్కిన్లకు బదులు మెన్ స్ట్రువల్ కప్స్ వాడేలా అవగాహన కల్పించారు. శానిటరీ నాప్కిన్స్ తో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు పర్యావరణహితంగానూ ఇది ఉపయోగపడుతుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కంబలంగి గ్రామాన్ని శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా ప్రకటించారు.. 

 

Leave a Comment