కాజల్ అగర్వాల్ పెళ్లి డేట్ చెప్పేసిందోచ్.. 

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి డేట్ ను చెప్పింది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో అక్టోబర్ 30న పెళ్లిచేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయన్ని కాజల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను ఎస్ చెప్పాను’ అంటూ పోస్ట్ పెట్టింది. ముంబైలోని ఓ హోటల్ లో ఈ పెళ్లి జరగబోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ వేడుకకు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు కాజల్ తెలిపింది. ఇన్నేళ్ల తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలుస్తూ తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పింది. 

 టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ కాజల్ పరిచయమైంది. ఈ తరువాత టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. గత 12 సంవత్సరాలుగా కాజల్ సినిమా ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ లో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది.  

Leave a Comment