కచ్చా బాదామ్ సింగర్ కి ప్రమాదం.. కొత్త కారులో ప్రయాణిస్తూ..!

ఇటీవల సోషల్ మీడియాలో ‘కచ్చా బాదామ్’ పాట ఓ ట్రెండ్ గా మారింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏదైనా ఈ పాట ఓ ఊపు ఊపేసింది. పాట పాడుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే వ్యక్తి సాంగ్ ని పాటగా మలిచారు. దీంతో ఆ పల్లీల వ్యాపారి ఒక్కసారిగా సెన్సెషన్ అయిపోయాడు. ఆ వ్యక్తికి తాజాగా కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. 

పశ్చిమ బెంగాల్ కి చెందిన భూబన్ బద్యాకర్ గల్లీలో కచ్చా బాదామ్ అంటూ అరుచుకుంటూ పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పచ్చి పల్లీలు ఇస్తుంటాడు. అతడి అరుపులను పాటగా మలిచారు. యూట్యూబ్ ఛానెల్స్, ఇన్ స్టా రీల్స్ తో కచ్చా బాదామ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతో భూబన్ జీవితమే మారిపోయింది. 

అతనికి వచ్చిన డబ్బులతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఈ కారులో ప్రయాణిస్తూ సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి ఛాతీలో బలమైన గాయం అయ్యింది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది..

Leave a Comment