SBI గుడ్ న్యూస్ : వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఏటీఎం..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తన కస్టమర్ల కోసం డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ను ప్రారంభించింది. ఇక నుంచి మీరు డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏటీెఎం సెంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేస్తే చాలు ఏటీఎం మీ ఇంటి వద్దకు వస్తుంది. 

ప్రస్తుతం ఈ డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ను లక్నోలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సర్వీస్ 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్వాంగులు, ఇంటికే పరిమితమైన రోగులు, అంధుల కోసం అందిస్తోంది. ఇందులో నగదు డ్రా, నగదు జమ, చెక్, ఫామ్ 15 హెచ్, కేవైసీ డాక్యుమెంట్, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికెట్ లాంటివి బ్యాంకులో సబ్మిట్ చేయడానికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ కు ఎస్బీఐ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఈ సేవలు కొన్ని బ్యాంకుల్లో మాత్రమే లభిస్తాయి. బ్యాంకుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. 

 

 

Leave a Comment