విచారణ జరుగుతుండగా.. జడ్జికి ‘ఐలవ్ యూ’ చెప్పిన దొంగ..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన లవ్ ప్రపోజల్ జరిగింది. విచారణ జరుగుతుండగా ఓ నిందితుడు జడ్జికి ఐ లవ్ యూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంజరిగిందంటే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు పోలీసులు అరెస్టు చేశారు. 

అతడి నేరానికి సంబంధించి ఆధారాలతో కేసు ఫైల్ చేశారు. విచారణ కోసం జడ్జి ముందుకు తీసుకొచ్చారు. తబితా బ్లాక్ మాన్ అనే మహిళ జడ్జి ఈ కేసు విచారణ చేపట్టారు. జూమ్ యాప్ ద్వారా వీడియోలో సంకెళ్లతో నిలుచున్న నిందితుడిని చూస్తూ జడ్జి అతడి నేరానికి సంబంధించి కేసు వివరాలను చదవడం ప్రారంభించారు. 

ఆ సమయంలో నిందితుడు డెమెట్రియస్ లూయిస్ ఊహించని విధంగా స్పందించాడు. ‘మీరుు చాలా అందంగా ఉన్నారు’. అంటూ జడ్జితో పరిహాసంగా పలకరించాడు. ఆ మహిళ జడ్జి కోపగించుకోకపోవడంతో వెంటనే ‘మీకో మాట చెప్పాలనుకుంటున్నా. నిజంగానే చాలా అందంగా ఉన్నారు. ఐ లవ్ యూ’ అని చెప్పాడు. 

దీంతో వీడియో కాల్ లో కేసు విచారణ చూస్తున్న న్యాయవాదులంతా షాక్ కు గురయ్యాడు. అయితే ఆ ప్రపోజల్ ను కాంప్లిమెంట్ లా భావించిని మహిళ జడ్జి ‘నీ పొగడ్తలు ఎక్కడైనా ఉపయోగపడవచ్చు కానీ ఇక్కడ పనిచేయవు’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.  

 

Leave a Comment