ఏపీలో మే 31న జాబ్ క్యాలెండర్..!

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..

అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. మే 31వ తేదీలోపు ఎన్ని పోస్టులు ఉన్నాయో లెక్కగట్టి నివేదిక తయారు చేయాలని స్పష్టం చేశారు. ఆ లెక్కల ఆధారంగా అవసరమైన పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ రూపొందించి మే 31న విడుదల చేస్తారని చెప్పారు. 

ఇందుకోసం గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను లెక్క తేల్చాలని సూచించారు. అనంతరం సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు, అధికారాలను వాటికి బదిలీ చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖాల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను ఆన్ లైన్ లో నేరుగా చూసుకునే అవకాశం ఉంటుంది.. 

 

Leave a Comment