జిన్నా పేరుతో ‘జిన్’..!

మహమ్మద్ అలీ జిన్నాను పాకిస్తాన్ దేశ జాతిపితగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తి పేరును ఒక మద్యం బాటిల్ కి పెట్టారు. ఆ జిన్ బాటిల్ ను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మద్యం బాటిల్ పై ‘జిన్నా.. అప్ గ్రేడెడ్ జిన్’ అని ముద్రించారు. బాటిల్ వెనుక వైపు జిన్నాకు సంబంధించిన కొంత సమాచారాన్ని ముద్రించి.. ఆ వ్యక్తిని స్మరించుకుంటూ అని రాశారు. 

 జిన్నాకు మంచి స్కాచ్, విస్కీ, జిన్, పూల్ బిలియర్డ్స్, సిగరెట్లు, పోర్క్ సాస్  ఇష్టమని, ఆయన వాటిని ఎప్పుడు ఖండించలేదని లేబుల్ పై రాసుంది. దీనిక సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతిపిత జిన్నా పేరిట జిన్ను తేవడమేంటని పాకిస్తాన్ కు చెందిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని జాతీయ పానీయంగా ప్రకటించాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.   

 

Leave a Comment