పాక్ పై 1971 యుద్ధం గెలిచి 50 ఏళ్లు.. విజయానికి గుర్తుగా స్పెషల్ డిజైన్స్ తో బైక్స్..!

1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. భారత్ ఈ యుద్ధం 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విజయానికి గుర్తుగా జావా మోటార్స్ సైకిల్స్ రెండు కొత్త రంగుల్లో బైక్స్ తీసుకొస్తుంది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రెండు కొత్త రంగుల బైక్లను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 

భారత సాయుధ బలగాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఖాకీ, మిడ్ నైట్ గ్రే రంగుల్లో ఈ రెండు కొత్త బైకులను రిలీజ్ చేసింది. ఫ్యూయల్ ట్యాంక్ పై మువ్వన్నెల జెండా, భారత సైన్య చిహ్నాన్ని ముద్రించింది.  ఈ జావా స్పెషల్ ఎడిషన్ ధరను రూ.1.93 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. జావా 42 ధరతో పోలిస్తే రూ.15 వేలు, స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే రూ.6 వేలు అధికంగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ బైకులను వినియోగదారులు జావా సంస్థ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. 

Leave a Comment