స్మార్ట్ మాస్క్..ధర రూ.3 వేలు!

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడ తప్పనిసరి. ఈ తరుణంలో జపాన్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ స్మార్ట్ మాస్కును తయారు చేసింది. ఈ మాస్క్ ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉంటుంది. అధునాతన టెక్నాలజీతో ఈ మాస్కును రూపొందించినట్లు రోబోలు తయారు చేసే డోనట్ రోబోటిక్స్ సీఈఓ తైసుకే ఓనో తెలిపారు. తెల్లని ప్లాస్టిక్ తో తయారైన స్మార్ట్ మాస్కును సీ-మాస్కుగా వ్యవహరిస్తన్నట్లు చెప్పారు. 

ఈ మాస్కు బ్లూ టూత్ ద్వారా మొబైల్ యాప్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సీ-మాస్కు ద్వారా మనం మొబైల్ యాప్ మెసేజ్ లు పంపుకోవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. మన మాటాలను టెక్ట్స్ రూపంలో మర్చుకోవచ్చు. ఈ సీ-మాస్కు జపాన్ భాష నుంచి ఇతర 8 భాషల్లో ట్రాన్స్ లేట్ చేస్తుంది. ఈ మాస్కు ధరించిన వ్యక్తి చన్నిగా మాట్లాడిన దాని శబ్ద తీవ్రతను యాప్ అధికం చేస్తుంది. సీ-మాస్కు ధర రూ.3వేలుగా కంపెనీ నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్ నాటికి జపాన్ మార్కెట్లోకి వస్తుంది. 

 

Leave a Comment