ఆనందయ్య మందు నేనూ వాడాను.. నాకు కరోనా రాలేదు : జగపతిబాబు

ఆనందయ్య మందుపై సీనియర్ హీరో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందును తాను ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హాని చేయదని తాను నమ్ముతానని చెప్పారు. ఆనందయ్య మందు వాడిన వారితో తాను ఒకడినని, తనకు కరోనా రాలేదని వ్యాఖ్యానించారు.  

ఆయుర్వేదం అనేది హాని చేయదని తాను నమ్ముతానని జగపతిబాబు అన్నారు. నేచర్, భూదేవి తప్పు చేయదన్నారు. ఆనందయ్య మందు విషయంలో చాలా మంది అభిప్రాయాలు చూశానని, రకరకాల వీడియోలు చూసిన తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చానని జగపతిబాబు అన్నారు. 

ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కచ్చితంగా మంచే జరుగుతుందని తాను ఆనందయ్య మందును వాడానని తెలిపారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు తనకు కరోనా రాలేదన్నారు. చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. ప్రజలను కాపాడేందుకు ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చిందని, ఈ మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని, అతన్ని దేవుడు ఆశీర్వదించాలని జగపతిబాబు పేర్కొన్నారు.   

Leave a Comment