జనవరి 9న అమ్మ ఒడి : మంత్రి సురేష్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ ఒడి రెండో విడత ఆర్థిక సాయాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి 9న అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.15వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 16న అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని, 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారని చెప్పారు. 20 నుంచి 24 వరకు అభ్యంతరాలు పరిశీలిస్తారన్నారు.  26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తారన్నారు. 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలుపుతారన్నారు. గతేడాదిలో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందిందని మంత్రి వెల్లడించారు. 

 

Leave a Comment