భారత్ కోసం ఇజ్రాయెల్.. ‘ఓం నమ:శ్శివాయ’ అంటూ ప్రార్థనలు.. వీడియో వైరల్..!

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈక్రమంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం సానుభూతి ప్రదర్శస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశం ప్రజలు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇజ్రాయెల్ ప్రజలు ఓం నమశ్శివాయ అంటూ భారతదేశ ప్రజల కోసం ప్రార్థనలు చేశారు. ఇజ్రాయెల్ లోని అవీవ్ లోని హబీమా స్క్వేర్ వద్ద వందలాది మంది కూర్చుని మంత్రిన్ని పఠించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ లోని భారతీయ దౌత్యవేత్త పవన్ కె పాల్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. 

‘ఇజ్రాయెల్ మొత్తం మీ కోసం ఐక్యంగా ఉన్నప్పుడు మీకు ఆశాకిరణం కనిపిస్తుంది’ అంటూ భారతీయులను ఉద్దేశించి ఆయన ఆ పోస్ట్ కు శీర్షిక జత చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసునూ కదిలించింది. చాలా లైకులు, షేర్ లను సాధించింది. ధన్యవాదాలు ఇజ్రాయెల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment