కీలక ప్రాజెక్టు కోల్పోయిన భారత్..చైనాకు ఛాన్స్..!

ఇండియా అత్యంక కీలక ప్రాజెక్టును కోల్పోయింది. ఈ ప్రాజెక్టును చైనా దక్కించుకుంది. చాబహార్ పోర్టు నుంచి జహేదాన్ వరకూ  రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఇరాన్ భారత్ తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం రూ.3,015 కోట్లతో 2022 నాటికి చాబహార్-జహేదాన్ మధ్య భారత్ రైలు మార్గాన్ని నిర్మించాలి. అఫ్ఘానిస్తాన్ బోర్డర్ ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైంది. 

ఈ ప్రాజెక్టు రద్దుతో భారత్ కు భారీ ఆదాయం కోల్పోయింది. అయితే భారత్ తమకు నిధులివ్వడంలో జాప్యం చేయడం వల్లే ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ఇరాన్ పేర్కొంది. అయితే ఈ రైలు మార్గాన్ని తామే సొంతంగా నిర్మించుకుంటామని తెలిపింది. 

చైనాతో ఒప్పందం

భారత్ తో ఒప్పందం రద్దు తర్వాత చైనా రంగంలోకి దిగింది. దీంతో చైనా మరియు ఇరాన్ మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్యలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్ లో అభివృద్ధి పనులకు చైనా ఖర్చు చేస్తుంది. ఇరాన్, చైనా ఒప్పందం కుదిరితే చాబహార్ పోర్టు నిర్మాణంలో చైనా కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాక చైనాకు ఇరాన్ ఆయిల్, గ్యాస్ ను సరఫరా చేయాల్సి ఉంటుంది. 

Leave a Comment