ఐపీఎస్ అధికారిణికి తప్పని వరకట్న వేధింపులు.. ఐఎఫ్ఎస్ భర్తపై ఫిర్యాదు..!

ఇద్దరు భార్యభర్తలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఉన్నత స్థానాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణిగా భార్య, ఐఎఫ్ఎస్ అధికారిగా భర్త విధులు నిర్వహిస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆ ఐపీఎస్ అధికారిణికి వరకట్న వేధింపులు తప్పట్లేదు. తన భర్త నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. వరకట్నం కోసం వేధిస్తున్నాడని బెంగళూరు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ కి చెందిన 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్ తో వివాహమైంది. నితిన్ ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. 

అయితే తన భర్త మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లకు లోనయ్యారు. ఆ అలవాట్లను వదిలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకున్న వదిలిపెట్టలేదు. కోపంతో తన మీద దాడి చేశాడని వర్తికా ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడుని తెలిపారు. 

అతనికి దీపావళికి కానుక ఇవ్వలేదని, విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలు కోసం అని రూ.35 లక్షల నగదు తీసుకున్నాడని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబ సభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. 

  

You might also like
Leave A Reply

Your email address will not be published.