ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా ఫైర్ 

ఢిల్లీలో జరిగిన అల్లర్లు అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి.  సీఏఏకు వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెలిసిందే. వీటిపై అంతర్జాతీయ పత్రికలు తమదై రీతిలో దాడి చేశాయి. 

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత వాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారునంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని మోడీ మౌనం వహించ వల్లనే 2002 లో గుజరాత్ తరహా అల్లర్లు మళ్లీ చెలరేగాయని ఈ పత్రికలు వ్యాఖ్యానించాయి.

       ‘మోడీ స్టోక్డ్ దిస్ ఫైర్’ అనే శీర్షకతో ద‘ది గార్డియన్’ పత్రిక వార్తను ప్రచురిచంది. ‘పోలిటిషియన్స్ స్టోక్డ్ ఢిల్లీ రైట్స్’ అని ‘ది ఖలీజ్ టైమ్స్’ వార్తను ప్రచురిచింది. ‘మోడీ సైలెన్స్ యాజ్ డెత్ టాల్ మౌంటెడ్’ అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్’ పత్రిక వార్తను రాసింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో  రోజు ప్రధాని మోడీ ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలసి మోడీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలో మీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్ స్పీజల్’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోడీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగపడవచ్చేమోగాని అంతర్జాతీయంగా భాతర్ పరువు తీస్తన్నాయంటూ ‘అవుట్ సైడ్ షో ఆఫ్, ఇన్ సైడ్ ప్రొటెస్ట్’ శీర్షికన ఆ పత్రిక వార్తను రాసింది. 

మోడీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్ ఆర్ ఆంగ్రీ, ఇట్స్ ముస్లిం ఆర్ వర్రీడ్’ శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్ న్యూస్ పీస్’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్ ఆఫ్ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్ అండ్ యాన్ అల్టిమేటమ్’ పేరిట ‘ న్యూయార్క్ టైమ్స్’ వార్తను ప్రచురిచింది. 

Leave a Comment