నీటి వృధా కాకుండా వినూత్న ఆలోచన..!

నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహాసముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టిగడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువ తెలియకుండా మనం ప్రతి రోజూ ఎన్నో లీటర్ల నీటిని వృధా చేస్తుంటాం.. 

నీటి వృధాను అరికట్టడం చాలా అవసరం.. మన ఇళ్లలోనే పాత్రలలో నీరు నింపుతున్నప్పుడు, బట్టలుతికే సమయంలో, పాత్రలు, వాహనాలు శుభ్రపరిచేటప్పుడు గుర్తించి నీటి వృధాను అరికట్టవచ్చు. కొన్ని సార్లు మనం తాగేనీటినీ వృధా చేస్తుంటాం.. మన ఇంట్లో క్యాన్ కు ఉన్న కులాయి నుంచి వృధాగా పోతున్న నీటి బొట్లను మనం గమనించము.. 

అయితే గుజరాత్‌లోని వల్సాద్‌కు చెందిన హిరెన్ పంచల్ అనే వ్యక్తి నీటి వృథాను అరికట్టేందుకు ఒక వినూత్న ఆలోచన చేశాడు. నీరు తాగేటప్పుడు చివరలో నీటి వృధా కాకుండా ఉండటానికి క్యాన్ కింద మొక్కల కుండీలను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా ఉంటుంది. పైగా ఒక మొక్క పెరిగేందుకు పోషణ ఇస్తుంది. 

 

Leave a Comment