దేశంలో తొలి ‘ప్లాస్మా బ్యాంక్’ ప్రారంభం

దేశంలో మొట్టమొదటి ‘ప్లాస్మా బ్యాంక్’ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభంచారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్)లో ఈ ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేయాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు. దేశంలోనే తొలి ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేశామని, దీంతో ప్రజలకు ప్లాస్మా కోసం ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్లాస్మా థెరపీ ద్వారా తాము చాలా మంది రోగుల ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. 

ప్లాస్మాను ఎవరు దానం చేయవచ్చు..

  • కోవిడ్ -19 నుంచి కోలుకున్న 18 నుంచి 60 సంవత్సరాల వారు ప్లాస్మాను దానం చేయవచ్చు. 
  • కరోనా నుంచి కోలుకుని 14 రోజులు అయి ఉండాలి.
  • బరువు 50 కిలోల కన్నా తక్కువ ఉండకూడదు.

ఎవరు దానం చేయకూడదు..

  • డయాబెటీస్ ఉన్న వారు మరియు ఇన్సులిన్ తీసుకునే వారు లేదా చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వారు ప్లాస్మాను దానం చేయలేరు. 
  • రక్తపోటు ఉన్న వారు లేదా 140 కన్నా ఎక్కువ బీపీ ఉన్న వారు ఇవ్వలేరు.

 

Leave a Comment