ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ : ఐసీఎంఆర్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) భారత ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ(ఐసీఎంఆర్) మరియు భారత్ బయోటెక్ ఇంటర్నెషనల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ‘COVAXIN’ ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ తయారైతే భారత్ లో తయారైన మొట్టమొదటి వ్యాక్సిన్ అవుతుంది.

ఈ వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ ఉన్నత వైద్య పరిశోధన సంస్థ తెలిపింది. ఇందు కోసం 12 ఇన్ స్టిట్యూట్లను ఎంపిన చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే అత్యున్నత స్థాయి ప్రాజెక్టు కాబట్టి క్లినికల్ ట్రయల్స్ ను పెంచాలని ఐసీఎంఆర్ సంస్థలను కోరింది.

అన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయితే స్వాతంత్య్ర దినోత్సవ నాడు వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టాలని ఐసీఎంఆర్ బావిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం విశాఖపట్నం, రోహ్తక్, న్యూఢిల్లీ, పాట్నా, బెల్గాం, నాగ్పూర్, గోరఖ్ పూర్, కట్టంకులతుర్(తమిళనాడు), హైదరాబాద్, ఆర్య నగర్, కాన్పూర్ మరియు గోవాలలో ఉన్న సంస్థలను ఎంపిక చేశారు. 

 

Leave a Comment