గర్భిణీని 2 కి.మీ. మోసుకెళ్లి.. ఆస్పత్రికి చేర్చిన భారత జవాన్లు..!

భారత జవాన్లు మానవత్వం చాటుకున్నారు.  ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణీని రెండు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతవ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుప్వారాలో ఫకియాన్ గ్రామానికి చందిన మంజూర్ అహ్మద్ షేక్ గర్భిణీ.. ఈక్రమంలో ఆమెకు జనవరి 5 అర్ధరాత్రి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. 

అయితే ఆ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తోంది. మరో వైపు తీవ్ర చలి ఉంది. సమీపంలో ఒక వాహనం కూడా లేదు. ఆస్పత్రి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ఎలాంటి మార్గం కనిపించలేదు. దీంతో ఆమె భర్త విలపిస్తూ సహాయం కోసం అభ్యర్థించాడు.

దీంతో ఆర్మీ జవాన్లు స్పందించారు. వెంటనే అహ్మద్ ఇంటికి చేరుకున్న నలుగురు సైనికులు ఆమె భూజాలపై మోస్తూ కరాల్ పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఆ గర్భినీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జవాన్లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

 

Leave a Comment