భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మృతి..!

భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (91) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. మే 24న కోవిడ్ కారణంగా ఆయన మొహాలీ ఫోర్టిన్ ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. నెగిటివ్ రావడంతో మే 30న డిశ్చార్జి అయ్యారు. అయినప్పటికీ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో జూన్ 3న చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

మిల్కాసింగ్ ఆసియా క్రిడల్లో నాలుగు సార్లు స్వర్ణం సాధించారు. 1958 కామన్వెల్త్ గేమ్స్ లో ఆయన పసిడి పతకంతో మెరిశారు. 1956, 1964 ఒలింపిక్స్ లో భారత్ తరఫున బరిలోకి దిగిన ఈ పంజాబీ వెటరన్ కు 1959లో పద్మశ్రీ అవార్డు దక్కింది. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్ తో పోరాడుతూ జూన్ 14న మరణించారు. భార్య మరణించిన నాలుగు రోజులకే ఆయన కన్నమూడంతో మిల్కాసింగ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మిల్కాసింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘భాగ్ మిల్కా భాగ్’ అనే బాలీవుడ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందేే..

Leave a Comment