వీరుల త్యాగాలకు నేటితో ఏడాది.. నివాళులర్పించిన ఇండియన్ ఆర్మీ..!

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. సరిగ్గా ఏడాది క్రితం చైనా దురాక్రమణకు అడ్డుగా నిలిచి, గాల్వాన్ లోయలో భారతదేశ వీరత్వానని చూపారు భారత జవాన్లు.. చైనా కుతంత్రాలను తిప్పికొడుతూ.. ఆ పోరాటంలో దాదాపు 20 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. 

ఈనేపథ్యంలో మంగళవారం లేహ్ లో గాల్వన్ హీరోలకు భారతీయ సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్ లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ నివాళులర్పించింది. మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్.. లేహ్ లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పాలతో నివాళి అర్పించారు. కాగా, యుద్ధభూమిలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆనాటి భారత్ బృందానికి తెలుగు వాడైన కర్నల్ సంతోష్ బాబు సారధ్యం వహించడం విశేషం..

Leave a Comment