వివాదానికి తెరపడినట్టేనా?…వెనక్కి తగ్గిన చైనా..!

భారత్ చైనా సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఓసీ వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన తర్వాత మూడు రోజుల క్రితం ప్రధాని మోడీ లద్దాఖ్ వెళ్లి సైన్యంతో మాట్లాడారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్, చైనా విదేశాంత మంత్రి వాంగ్ యి తో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత లద్దాఖ్ పరిధిలోని పలు కీలక పాయింట్ల నుంచి చైనా సైన్యం సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వరకు వెనక్కి వెళ్లింది. నదిలోయలో తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేసింది. 

ఇక సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. దీంతో ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ఇరు దేశాల సైనిక బలగాలను త్వరగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇక ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం నిరంతరం చర్చలు కొనసాగాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రధాని మోడీ లద్దాఖ్ పర్యటన తర్వాత అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ లతో అజిత్ ధోవల్ భేటి అయ్యారు. ఈ భేటిలో సుమారు రెండున్నర గంటల పాటు చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. వివాదాస్పద భూభాగం నుంచి వెనక్కి తగ్గాలని కోరారు. దీంతో చైనా సైన్యం వెనక్కి తగ్గంది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. 

 

Leave a Comment