అదరగొట్టిన కివీస్..!

22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

టీ20లో 5-0తో సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డేల్లో అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్ ను 2-0తో ఆధిక్యంలో ఉంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్కులో జరిగిన రెండో వన్డేలో  274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 22 పరుగుల తేడాతో ఓడిపోయింది కోహ్లీ సేన. వరుసగా రెండో వన్డేలో ఓడిపోవడంతో సిరీస్ ను కోల్పోయింది. 

టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్ లలో గుప్టిల్ 79, రాస్ టేలర్ 73, నికోల్స్ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్ల లో చాహల్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీసుకున్నారు. 

274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దినిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్ మెన్ లలో పృథ్వీషా 19 బంతుల్లో 24 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3) నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ (15), రాహుల్(4), కేదార్ జాదవ్(9) సైతం స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో జట్టును ఆదుకునే బాధ్యత శ్రేయస్ అయ్యర్ పై పడింది. అయ్యర్ 52 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుట్ కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ దశలో జడేజా లోయర్ ఆర్డర్ బ్యాట్స్  మెన్ సాయంతో పోరాటం సాగించాడు. శార్దూల్ ఠాకూర్ 18 పరుగులు చేయగా, నవదీప్ సైనీ 49 బంతుల్లో 5 ఫ్లోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు. జడేజా చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. జడేజా 53 పరుగులతో రాణించాడు. ఇక చివరి వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనుయ్ లో జరగనుంది.

Leave a Comment