యూపీ గ్యాంగ్ రేప్.. తల్లిదండ్రులను ఇంట్లో పెట్టి తాళం వేసి.. రాత్రికి రాత్రే అంత్యక్రియలు..

ఉత్తరప్రదేేశ్ లోని హత్రాస్ లో జరిగిన సంఘటన మరోమారు యూపిలో ఆడపిల్లలకు రక్షణ లేదని మరోమారు రుజువు చేసింది. మనీషా అనే 19 ఏళ్ల దళిత బాలికపై అగ్రవర్ణ కులాలకు చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మనీషా బయటకు వెళ్లి వారి గురించి చెప్పకూడదని నాలుక కోసి, నడవకూడదని ఆమె వెన్నముకను విరగొట్టారు. భౌతికంగా చిత్రవధ చేశారు. మెడను తిప్పేశారు. 10 రోజులు ఆమె ప్రాణం కోసం పోరాడి ఆ యుద్ధంలో ఆమె ఓడిపోయి మరణించింది.

అత్యాచారానికి గురై మరణించిన దళిత యువతి పట్ల పోలీసులు అత్యంత ఘోరంగా వ్యవహరించారు. ఈ కేసును దారి మళ్లీంచేందుకు మనీషా మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చేశారు. ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకెళ్లి రేపు ఉదయం దహనం చేస్తామని మనీషా తండ్రి పోలీసులకు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఆమె తల్లిదండ్రులను ఇంట్లో పెట్టి తాళం వేసి, బంధువులను, మీడియా రిపోర్టర్లను అడ్డుకుంటూ పోలీసులు మానవహారంలా నిల్చుని అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని దహనం చేశారు. పోలీసుల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా పోలీసులు తొలుత ఈ కేసును హత్యాయత్నం కింద నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం తర్వాత అత్యాచార కేసు నమోదు చేశారు. పోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

 

 

Leave a Comment