కరోనా లక్షణాలను గుర్తించే బ్యాండ్..!

కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్, వియర్ బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా ఒక బ్యాండ్ ను రూపొందిస్తోంది. ఈ బ్యాండ్ ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నా త్వరగా గుర్తిస్తుంది. ఈ బ్యాండ్ ను వచ్చే నెలల్లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఈ బ్యాండ్ ను చేతి మణికట్టుకు ధరించాలి. దీంతో ఈ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఉష్ణోగ్రత, గుండె, ఆక్సిజన్, రక్త పనితీరును గుర్తించవచ్చు. దీని ధర రూ.3,500 ఉటుంది. ఈ బ్యాండ్ ను మొబైల్ ఫోన్, బ్లూటూత్ తో కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్ ధరించి కంటైన్ మెంట్ జోన్లలో ప్రవేశిస్తే వెంటనే ఆరోగ్య సేతు యాప్ ను అలర్ట్ చేస్తుంది.   

Leave a Comment