మరో డేంజర్ బెల్.. జూన్ లో కరోనా ఫోర్త్ వేవ్..!

ఇప్పుడిప్పుడే కరోనా మూడో వేవ్ నుంచి దేశం కోలుకుంటోంది.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈక్రమంలో కార్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు మరో డేంజర్ బెల్ మోగించారు. అదే అండీ కరోనా నాలుగో వేవ్.. ఇండియాలో జూన్ నెలలో కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 

ఈ ఫోర్త్ వేవ్ ప్రభావం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 22 నాటికి కరోనా నాలుగో వేవ్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీని తీవ్రతపై మాత్రం ఇంకా అంచనా వేయలేదు. ఇది వైరస్ సంక్రమణ, కొత్త వేరియంట్ బట్టి ఉంటుందని తెలుస్తోంది.. 

ఈ ఫోర్త్ వేవ్ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు అంటున్నారు. ఆగస్టు 15 నుంచి 31 వరకు కరోనా కేసులు పీక్స్ కి వెళ్తాయని, ఈ తర్వాత క్రమంగా తగ్గుతాయని తెలిపారు. ఈ అంశాలను పరిశోధించేందుకు ఐఐటీ కాన్ఫూర్ శాస్త్రవేత్తలు ‘బూస్ట్ స్ట్రాప్’ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇదిలా ఉంటే గత మూడు వేవ్ ల సమయంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల అంచనాలు దాదాపు నిజమైంది. అందుకే ప్రతి ఒక్కరూ అలసత్వం చేయకుండా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.    

Leave a Comment