నాడు కరోనా..నేడు ఒమిక్రాన్.. ఇప్పుడు IHU వేరియంట్..!

ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో వైపు యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్ లో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా దెబ్బకి ఇప్పుడే చాలా మంది తమ జీవన విధానాన్ని మార్చుకొని బ్రతుకుతున్నరు.ఎంత మంది తిండి లేకుండా,కట్టుకోవడని తగిన బట్టలు లేకుండా ఇబ్బంది పడ్డుతుంటున్నారు ఈ కరోనా వల్ల అలాంటి ఈ సమయంలో ఓక కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వచింది.

దీనికి తోడు మంటకు నూనె పోసినట్టు ఇంకా ఓక వెరియంట్ ఫ్రాన్స్ నుంచి వచ్చింది.దాని పేరు IHU వేరియంట్. కరోనా..ఈ పేరు వింటూనే జనాల్లో ఏదో తెలియని భయము. ఈ వైరస్ దాదాపు ఒకటిన్నర సంవత్సరము అందరి జీవితాలు మార్చేసింది.అలాంటిది తిరిగి మళ్ళి భయం కలిగిస్తా ఉంది.కరోనా ఉప్పెనై ముంచుకొస్తుంది. కొన్ని వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నాయి.

కరోనా నిబంధనలు మరియు జాగ్రత్తలు పాటించకుండా మళ్ళి ప్రజలు సినిమాలు చూడటము,ఎన్నికల ర్యాలిలోకి వెళ్ళితే మళ్ళి కరోనా అధిక సంఖ్యలో ఎక్కువ అవ్వడము తప్పనిసరే అని ప్రొఫసర్ అంటున్నారు

ఈ కొత్త కోవిడ్‌ వేరియంట్‌ రకాన్ని ఫ్రెంచ్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇది కామెరూనియన్ మూలానికి చెందినదిగా శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ కు తాత్కాలికంగా ‘ IHU ‘ అని పేరు పెట్టారు. ఇది కరోనా B.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్దారించారు.

అంతేకాదు ఫ్రాన్స్ లో ఈ వేరియంట్‌ బారిన 12 మంది పడినట్లు చెప్పారు. ఈ కొత్త వేరియంట్‌ IHUలో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సరికొత్త వేరియంట్  మొదట డిసెంబర్ 10న వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే WHO ఇప్పటికీ దీనిని పరిశోధనలో ఉన్న వేరియంట్‌గా గుర్తించలేదు. ఈ IHU వేరియంట్  ముప్పు ఒమిక్రాన్ కంటే అధికమని.. వేగం వ్యాపిస్తుందని పరిశోధకులు తగిన జాగ్రత్తలు తీసుకువాలంటూ ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరిస్తున్నారు.

 

 

Leave a Comment