బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే.. గుండె జబ్బులు వస్తాయట..!

ఉదయం లేస్తేనే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం.. అయితే కొంతమంది నోటిని శుభ్రం చేసుకునేందుకు బద్ధికస్తూ ఉంటారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైదులు చెబుతున్నారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే నోటిలోని బ్యాక్టీరియా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. నోటి బ్యాక్టిరియా నుంచి గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు:

  • పేలవమైన నోటి శుభ్రత రక్తంలో బ్యాక్టీరియాకు దారి తీస్తుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ పేర్కొంది. దీని వల్ల శరీరంలో వాపు వస్తుందని, ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుందని వెల్లడించింది. 
  • నోటిని శుభ్రంగా ఉంచేందుకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. బ్రష్ చేసినప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు పళ్లను తోముకోవాలి. టూత్ బ్రష్ ను ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మార్చాలి.
  • బ్రష్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను తొలగించడానికి మౌత్ వాష్ ఉపయోగించండి..  
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. స్వీట్స్, కూల్ డ్రింక్స్  పరిమితం చేయాలి. 
  • ధూమపానం చేయడం, పొగాకు నమలడం పూర్తిగా మానేయాలి. 
  • క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి. 

 

 

 

 

Leave a Comment