చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగుంటే సీఎం అయ్యేవారు : పవన్ కళ్యాణ్

చిరంజీవి రాజకీయాల్లోనే ఉండి ఉంటే ఇప్పుడు సీఎం అయ్యేవారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదన్నారు. అధికారం మనకు బాధ్యత అని, అలంకారం కాదని, అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారని పేర్కొన్నారు. 

వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఏపీ మంత్రుల్లో చాలా మంది చరిత్ర తనకు తెలుసని, తప్పును ప్రతి ఒక్కరూ ఎదిరించాలని జనసేనాని పిలుపునిచ్చారు. మిగితా రాజకీయ నేతల్లా తనకు సిమెంట్ ఫ్యాక్టీరీలు లేదని, వ్యాపారాలు లేవని, అక్రమ సంపాదన అంతకంటే లేదని తెలిపారు. అందుకే ఇప్పుడు కూడా సినిమాలు చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.

 మిగిలిన వారు 25 కేజీల బియ్యం ఇస్తామంటున్నారని, తాను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు. సెల్ఫీ తీసుకోలేదని, ఫొటో తీసుకోలేదని తనపై కోసం చూపించవద్దని అభిమానులను కోరారు. రైతుల కోసం, అమరావతి రైతు కోసం లాఠీలు విరిగినా ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడదించారు.   

Leave a Comment