‘కోవ్యాక్సిన్’ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన

భారత సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషన్ లిమిటెడ్ తయారు చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ పై నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ ను సమర్థించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే ‘కోవ్యాక్సిన్’ తయారీ, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాటికి వ్యాక్సిన్ ప్రారంభించాలన్న కౌన్సిల్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. మానవులపై ట్రయల్స్ జరకముందే వ్యాక్సిన్ విడుదల తేదీని ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చింది. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేస్తోందని చెప్పింది. అయితే భారత్ బయోటెక్ ప్రీ క్లినకల్ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే మానవులపై క్లినికల్ ట్రయల్ కు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతిచ్చారని స్పష్టం చేసింది. 

Leave a Comment