కోహ్లీ సెంచరీ చేసే వరకు నేను పెళ్లి చేసుకోను..!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. కెరీర్ లో 100వ టెస్ట్ ఆడుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తాడని భావించారు. కానీ ఈసారి అభిమానులకు నిరాాశే ఎదురైంది. కోహ్లీ సెంచరీ సాధించలేకపోయాడు.కేవలం 45 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు..కాగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ కొట్టి రెండేళ్లు దాటింది. 2019లో చివరిసారిగా బంగ్లాదేశ్ పై కోహ్లీ సెంచరీ చేశాడు.. 

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు..ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించలేదు. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ రెండో రోజు స్టేడియంలో ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్డులో ‘కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసే వరకు పెళ్లి చేసుకోను’ అని రాసుకున్నాడు. ఈ ప్లకార్డ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.  

 

Leave a Comment