జక్కన్న సినిమాల్లో నటించను.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఎంతో మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన తెరకెక్కించే సినిమాల్లో నటిస్తే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చని భావిస్తుంటారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో నటించలేదు. ఇక నటించరు కూడా.. ఎందుకంటే ఈ విషయంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో తాను నటించనను మెగాస్టార్ తేల్చి చెప్పారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.. ఈ మూవీ అక్టోబర్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆయన బాలీవుడ్‌కి చెందిన ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టు.. ‘రాజమౌళి దర్శకత్వంలో మీరు నటించనని అన్నారు ఎందుకు’ అని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ.. ‘రాజమౌళి అద్భుతమైన దర్శకుడు. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ నటనలో పర్ఫెక్షన్‌ వచ్చేవరకూ, బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చేవరకూ వదలరు. ఓ నటుడిగా నేను ఆయన కోరుకున్నట్టుగా బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఆయన ఒక్క సినిమా కోసం.. మూడేళ్లు లేదా ఐదేళ్ల వరకు సమయం తీసుకుంటారు. నేనేమో ఒకేసారి నాలుగు చిత్రాలతో బిజీగా ఉంటున్నా. అందుకే ఆయన దర్శకత్వంలో నటించి పాన్‌ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందాలని నాకు లేదు. కానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉంది’ అని ఆయన సమాధానమిచ్చారు.

 

Leave a Comment