నేను ఎవరికి అన్యాయం చేయలేదు : యాంకర్ ప్రదీప్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో 139 మంది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే..ఇందులో ప్రముఖుల పేర్లు సైతం ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీటిలో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండడంపై గురువారం ఆయన స్పందించారు. స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. 

తనపై వస్తున్న ఆరోపణలను ప్రదీప్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఈ కేసులో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారో..ఎవరు చేయిస్తున్నారో ఆలోచించకుండా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేయడం ఎంతగానో బాధ కలిగిస్తోందని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ విడుదల చేసిన ఈ వీడియోను ఒకసారి చూడండి…

Leave a Comment