ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..!

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’ అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్(29) హైదరాబాద్ కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. 

శనివారం రాత్రి రూమ్ మేట్స్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయలేదు. దీంతో పై పోర్షన్ లో వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చేశాడు. గదిలో సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. భార్గవ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ పోన్ లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

Leave a Comment