ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భార్యను మేకప్ లేకుండా చూసి విడాకులు కోరిన భర్త..!

అందంగా ఉన్న అమ్మాయిలను చూస్తే.. అబ్బా హీరోయినల ఉంది కదూ అనుకుంటారు.. ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకోకుండా బయటకి రావడం లేదు. అలా ఓ అమ్మాయికి అట్రాక్ట్ అయిన ఓ యువకుడు ఆమెను ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు.. పెళ్లయ్యాక భార్యను చూసి షాక్ అయ్యాడు. ఇన్నాళ్లు నేను ప్రేమించిన అందగత్తె ఈమేనా అని అవాక్కయ్యాడు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.. 

ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఇద్దరు రోజూ చాటింగ్ చేసుకునే వారు. అలా ఇద్దరి మనసులు కలిశాయి. ఫేస్ బుక్ లో అమ్మాయి ఫొటోలను చూసి అతడు ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. ఆమెతో పలు మార్లు డేటింగ్ కూడా వెళ్లాడు. చివరికి అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు…

కానీ పెళ్లయిన మరుసుటి రోజే అసలు బండారం బయటపడింది. భార్య అసలు అందం చూసి షాక్ అయ్యాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెలరోజుల పాటు ఎదురుచూశాడు. కానీ అతడికి ఆశభంగమే కలిగింది. ఇక ఫలితం లేక తనకు విడాకులు కావాలని హెలిపోలిస్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.      

Leave a Comment